Nidhhi Agerwal : పాపం నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ సినిమా నిధికి మైనస్ అవుతుందా?

కెరీర్ కాస్త స్లోగా ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ని తీసుకున్నారు.

Nidhhi Agerwal :  తెలుగులో సవ్యసాచి(Savyasachi), మిస్టర్ మజ్ను(Mr Majnu), ఇస్మార్ట్ శంకర్(Ismart shankar) సినిమాలతో అలరించింది నిధి అగర్వాల్(Nidhhi Agerwal). ఆ తర్వాత చేసిన తమిళ్(Tamil), తెలుగు(Telugu) సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో కెరీర్ కాస్త స్లోగా ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. క్రిష్(Krish) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు(HariHara Veeramallu) సినిమాలో నిధి అగర్వాల్ ని తీసుకున్నారు. ఈ సినిమాతో నిధి తన ఫేట్ మారిపోతుంది అనుకుంది. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఒక్కో సినిమా కమిట్ అవుతున్నకొద్దీ నిధి అగర్వాల్ కి కష్టాలు ఎక్కువైపోతున్నాయి. హరిహర వీరమల్లుకు ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి రావడం, ఎక్కువ టైం ఇవ్వాల్సి రావడంతో ఎలక్షన్స్ లోపు ఎలాగైనా ఉన్న సినిమాలు పూర్తి చేయాలని, డబ్బులు సంపాదించాలని పవన్ హరిహర వీరమల్లు సినిమాని పక్కనపెట్టి కొత్త సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాంతో హరిహరవీరమల్లు కాస్తా వెనక్కి వెళ్లిపోతోంది. హరిహర వీరమల్లు తర్వాత ఓకే అయిన కథలన్నీ వరుసగా సెట్స్ మీదకు వెళ్తున్నాయి. కానీ వీరమల్లు మాత్రం ఆగిపోయింది.

దీంతో హరిహరవీరమల్లుతో మళ్లీ ఫామ్ లోకి వద్దామనుకున్న నిధి ఆశలు గల్లంతయ్యాయి. పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు ఆఫర్ రావడంతో మళ్లీ ట్రాక్ లో పడతానని తెగ ఆనందపడిపోయింది. కానీ 3 ఏళ్ల క్రితం మొదలైన హరిహరవీరమల్లు ఇంకా కంప్లీట్ అయ్యిందే లేదు .ఆ మధ్య కాలంలో వర్క్ షాప్ లకి కూడా అటెండ్ అయ్యిన నిధి సినిమా కంప్లీట్ అయ్యేదెప్పుడా అని వెయిట్ చేస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మిగిలిన సినిమాల్లో హీరోయిన్లని కన్ ఫామ్ చేసి వాళ్లతో షూటిగ్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. లేటెస్ట్ గా సుజిత్ తో చేస్తున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియంకా అరుళ్ మోహన్ ని ఫిక్స్ చేశారు టీమ్. మొన్నీమధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజాహెగ్డేతో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యింది. ఇలా తోటి హీరోయిన్లు ఈ స్టార్ హీరోతో సినిమాలు కంప్లీట్ చేసేసి కెరీర్ గ్రాఫ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటే నిధి అగర్వాల్ మాత్రం హరిహరవీరమల్లు ఎప్పుడు అయిపోతుందా అని ఆలోచిస్తోంది.

Bandla Ganesh : బండ్ల గణేష్ కొడుకుని చూశారా.. బండ్లన్న యంగ్ గా ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాడేమో..

ప్రజెంట్ నిధి వేరే సినిమాలు కూడా చెయ్యడం లేదు. ఎప్పుడు హరిహరవీరమల్లు షెడ్యూల్ స్టార్ట్ అవుతుందో, పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, మళ్లీ వేరే సినిమాకు లాక్ అయిపోతే ఈ షూటింగ్ కి కష్టం అయిపోతుందేమో అని, వేరే సినిమాలకి కూడా కమిట్ అవ్వడం లేదు నిధిఅగర్వాల్. దీంతో నిధికి పాపం వేరే సినిమాలు చేసే స్కోప్ కూడా రావట్లేదు. హరిహరవీరమల్లుతో మళ్లీ బిజీ అవుదామనుకుంటున్న నిధి ఆశలు ఎప్పుడు నెరవేరతాయో ఏంటో చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు