Nidhi Agarwal interesting facts about Prabhas.
Nidhi Agarwal: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతీ తెరకెక్కించిన ఈ హారర్ అండ్ కామెడీ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చతికల పడింది ఈ సినిమా.
ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సినిమా బాలేదు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. దీంతో. ది రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది. అయితే. ది రాజాసాబ్ సినిమా రిజల్ట్ పై దాదాపు అందరు కామెంట్స్ చేశారు కానీ, హీరో ప్రభాస్ రియాక్షన్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అయితే, ది రాజాసాబ్ సినిమా ఫలితంపై ప్రభాస్ రియాక్షన్ ఏంటి అనే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal).
Anil Ravipudi: ఇద్దరు సిద్ధం.. మరి సినిమా ఎవరితోనో.. దిల్ రాజు కూడా వెయిటింగ్ అక్కడ!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.’ప్రభాస్ హిట్.. ఫ్లాప్ గురించి పట్టించుకోడు. తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫేక్ గా ఉండటం ఆయనకు తెలియదు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా జాలీగా, చాలా సింపుల్ గా ఉంటాడు. అందరితో చిన్న పిల్లవాడిలా కలిసిపోతాడు. అవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయనలా నేను ఉండగలనా అని అనుకుంటాను.
ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది పీఆర్ టీమ్స్ ని మైంటైన్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ కి పీఆర్ టీం లేదు. రాజాసాబ్ సినిమాలో ఆయనతో కలిసి పని చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి. అలాంటి మంచి మనిషిని నా జీవితం లో చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. దీంతో, నిధి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.