Nidhi Agarwal shocking comments about Hari Hara Veera Mallu movie
Nidhhi Agerwal: సౌత్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ తోపాటు మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన కెరీర్ గురించి మాట్లాడుతూ హరి హర వీరమల్లు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
The Raja Saab: రాజాసాబ్ ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు.. అది వాళ్ళ భయం!
‘హరి హర వీరమల్లు సినిమా నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన నటించడం నా అదృష్టం. నేను నటించిన ఫస్ట్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమాలో నా లుక్ కూడా చాలా బాగుటుంది. కేవలం హరి హర వీరమల్లు సినిమా వల్ల నాకు కొత్తగా మూడు ఆఫర్స్ వచ్చాయి. వాటి గురించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా మేకర్స్ ప్రకటిస్తారు.
అందుకే, హరి హర వీరమల్లు నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్(Nidhhi Agerwal). దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, నిధి అగర్వాల్ చేస్తున్న మూడు కొత్త సినిమాల డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. వాటిలో రెండు కుర్ర హీరోలతో కాగా ఒకటి పాన్ ఇండియా స్టార్ తో ఉంటుంది అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఈ మూడు సినిమాల్లో ఒకటి హిట్ అయినా నిధి టాప్ స్టార్ అవడం ఖాయం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళ తరువాత వరుసగా ఆఫర్స్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. ఇదే సిచువేషన్ లో వీరే హీరోయిన్ ఉంటే తన కెరీర్ క్లోజ్ అయిపోయి ఉండేది. మరి నిధి తన తరువాతి సినిమాలతో మంచి హిట్స్ అందుకొని టాప్ స్టార్ గా ఎదుగుతుందా అనేది చూడాలి.