Niharika Konidela
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల ఇప్పుడు ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా ఓ మూవీ నిర్మిస్తోంది. మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు.
తాజాగా, నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలువురు టాప్ హీరోలతో నిర్మాతగా సినిమాలు చేస్తే ఎటువంటి మూవీలు తీయాలని ఉందో చెప్పింది. అల్లు అర్జున్‌తో లవ్ స్టోరీ సినిమాను తీస్తానని పేర్కొంది.
మహేశ్ బాబుతో మైథలాజికల్ సినిమా, ప్రభాస్‌తో కామెడీ మూవీ తీయాలని ఉందని నిహారిక తెలిపింది. తాను ఒకవేళ డైరెక్ట్‌గా మారితే తన మొట్టమొదటి సినిమా రామ్ చరణ్‌తో తీస్తానని చెప్పింది. యాంకర్‌గా చేసేటప్పుడు ఎక్కువగా మేకప్ వేసుకోవద్దని తనకు తాను చెప్పుకుంటానని తెలిపింది.
అలాగే, నిర్మాతగా వ్యవహరించేటప్పుడు తనను తాను నమ్ముకోవాలని చెప్పుకుంటున్నాని అంది. నటిగా చేసేటప్పుడు మంచి స్క్రిప్టులు ఎంచుకోవాలని అనుకుంటానని తెలిపింది. మెగా కుటుంబానికి చెందిన నిహారిక తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె తన కెరీర్‌లో నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ప్రతిభను చాటుకుంది.