×
Ad

Niharika: వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు.. ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్.. నిహారిక గ్రేట్ అంటూ నెటిజన్స్ సపోర్ట్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నిర్వాహకులపై నిహారిక(Niharika) కొణిదెల షాకింగ్ కామెంట్స్ చేశారు.

Niharika Konidela shocking comments on Film Fare Awards event organisers.

Niharika; మెగా డాటర్ నిహారిక కొణిదెల నెటిజన్స్ మనసులు గెలుచుకున్నారు. తాజాగా జరిగిన ఒక అవార్డు ఈవెంట్ లో నిర్వాకులు వ్యవహరించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆ పాయింట్ ను లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దాంతో, ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అలాగే, ఆమె చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధాన వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో అన్ని సినీ పరిశ్రమల నుంచి డెబ్యూటెంట్(నూతన పరిచయం) గా చాలా నటీనటులు అవార్డులు అందుకున్నారు. కానీ, వాళ్ళకి ఆ స్టేజిపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు నిర్వాహకులు. ఈ విషయాన్ని లేవనెత్తారు నిహారిక(Niharika).

AA22xA6: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. AA22 టీజర్ వచ్చేస్తోంది.. RFC భారీ ఈవెంట్

‘డెబ్యూ అవార్డు అనేది ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అలాంటి సమయంలో వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ జీవితకాల కల. కానీ, నిర్వాహకులు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని నాకు కూడా తెలుసు. కానీ, మొదటిసారి అవార్డు అందుకున్న ఆర్టిస్టులకు అలాంటి స్టేజిపై మాట్లాడే అవకాశం కల్పిస్తే అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అంటూ రాసుకొచ్చింది నిహారిక.

దీంతో నిహారిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే, ఏ విషయంలో ఆమెకు నెటిజన్స్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు చేసి కొత్త వాళ్ళను పరిచయం చేయడమే కాదు, ఇలా వాళ్ల కోసం మీరు స్టాండ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా నిహారిక చాలా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కనీసరం నిహారిక చేసిన కామెంట్స్ ని పరిగణంలోకి తీసుకొని నెక్స్ట్ టైం అయినా వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని కలిపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.