×
Ad

Niharika NM: మన హద్దుల్లో మనం ఉండాలి.. నిహారిక ఎన్ఎమ్ సెన్సేషన‌ల్ కామెంట్స్..

నిహారిక ఎన్ఎమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ (Niharika NM)సోషల్ మీడియా సెన్సేషన్ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మిత్ర మండలి".

Niharika NM makes sensational comments on casting couch in Tollywood

Niharika NM: నిహారిక ఎన్ఎమ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిత్ర మండలి”. ప్రియదర్శి, రాగ్ మయూర్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు విజయేంద్ర ఎస్ తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు (Niharika NM)రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిహారిక ఎన్ఎమ్.

Kishkindhapuri OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ కిష్కిందపురి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సందర్బంగా ఆమె సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్కరికీ ఒక్కో రకం అనుభవం ఉంటుంది. బయట వాళ్లు పరిశ్రమ గురించి రకరకాలుగా అనుకుంటారు. ఎవరు మనతో ఎలా ఉన్నా మన హద్దుల్లో మనం ఉన్నంతవరకు ఎలాంటి సమస్యలు రావు”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక ఎన్ఎమ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు అన్ని కామెడీ ఎంటర్టైనర్ లాంటి కథలే వస్తున్నాయని కానీ, తనకు మాత్రం డిఫరెంట్ కథలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనీ ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.