Nikesha Patel : పెళ్లి కొడుకు దొరికాడు అంటున్న పవన్ హీరోయిన్

నికిషా ట్విట్టర్ లో నెటిజన్లతో మాట్లాడగా ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడిగారు. దీనికి.. త్వరలోనే చేసుకుంటాను. అతను దొరికాడు. యూకేలో.........

Nikesha

Nikesha Patel :  సెలబ్రిటీలు, స్టార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఎప్పుడూ టచ్ లో ఉంటారు. వారికి మరింత దగ్గరవడానికి అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి సినిమాలో నటించి మెప్పించిన నికిషా పటేల్ ట్విట్టర్ లో నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చింది. నికిషా కొమరం పులి సినిమా తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఓం సినిమాలో నటించింది. ఆ తర్వాత అసలు తెలుగులో కనపడలేదు. అప్పుడప్పుడు తమిళ్ లో సినిమాలు చేసింది.

Rakul Preet Singh : ప్రతిసారి పెళ్లి గురించి అడగకండి.. చెప్పాల్సిన అవసరం లేదు..

నికిషా ట్విట్టర్ లో నెటిజన్లతో మాట్లాడగా ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడిగారు. దీనికి.. త్వరలోనే చేసుకుంటాను. అతను దొరికాడు. యూకేలో ఉంటాడు అని రిప్లై ఇచ్చింది. దీంతో నికిషా పటేల్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది అని తెలుస్తుంది. అయితే నికిషా యూకే లోనే పుట్టి పెరిగింది. పేరెంట్స్ ఇండియన్స్ అయినా యూకేలో సెటిల్ అయ్యారు. తనకి యూకే పౌరసత్వం కూడా ఉంది. దీంతో ఇప్పుడు యూకే అబ్బయిని చేసుకుంటాను అని చెప్పడంతో అక్కడి అబ్బాయినే లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి నికిషా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.