Nikhil Siddhartha Comments On Ttd Laddu Row
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందించారు. గత కొన్నేళ్లుగా ఇలా జరిగిందని తెలిసి షాక్ అయినట్లు చెప్పాడు. ఇది ఏ ఒక్కరికో జరిగింది కాదని, ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం అని అన్నారు.
ఇలాంటి పనిని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశాడు.
RGV Saree Song : ఆర్జీవీ ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసిందిగా.. హాట్ విజువల్స్‌తో ఆర్జీవీ మార్క్..
“గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి ప్రసాదంలో టాంపరింగ్ జరిగిందని తెలిసి షాక్ అయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి.” అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను నిఖిల్ ట్యాగ్ చేశారు.
It is SHOCKING what has Happened with the Tirumala Tirupati Prasadam Tampering in the last few years … this is an unforgivable Insult not just to one Faith but to Every Indian Citizen.
Whichever Filthy Human has done this Will face the wrath and must be Punished to the fullest.…— Nikhil Siddhartha (@actor_Nikhil) September 21, 2024