RGV Saree Song : ఆర్జీవీ ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసిందిగా.. హాట్ విజువల్స్‌తో ఆర్జీవీ మార్క్..

తాజాగా శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు.

RGV Saree Song : ఆర్జీవీ ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసిందిగా.. హాట్ విజువల్స్‌తో ఆర్జీవీ మార్క్..

RGV Aaradhya Devi Saree Movie First Song Released

Updated On : September 22, 2024 / 11:35 AM IST

RGV Saree Song : ఆర్జీవీ గతంలో చీరలతో ఫోటోషూట్స్ చేసే ఓ మలయాళీ అమ్మాయిని వైరల్ చేసి ఆ అమ్మాయితో శారీ అనే సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో శారీ సినిమా తీసి ఇటీవల టీజర్ కూడా రిలీజ్ చేసాడు ఆర్జీవీ. టీజర్లో.. రెగ్యులర్ గా చీరల్లో తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన అబ్బాయి ఆ ప్రేమ ఎక్కువై సైకోగా ఎలా మారాడు అన్నట్టు కథ ఉండబోతుందని చూపించారు.

Also Read : Prabhas : ప్రభాస్ కొత్త లుక్.. హను రాఘవపూడి సినిమా కోసం ముంబైలో లుక్ టెస్ట్..

తాజాగా శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ఐ వాంట్ లవ్ ఫర్ ఎవర్ అంటూ సాగే ఈ సాంగ్ లో ఆరాధ్య దేవిని మరింత అందంగా చూపిస్తూ ఈ సాంగ్ షాట్ చేసారు. అడవుల్లో, జలపాతం వద్ద ఈ సాంగ్ షూట్ చేసారు. ఈ పాటని సిరాశ్రీ రాయగా DSR బాలాజీ సంగీత దర్శకత్వంలో కీర్తన శేష్ పాడింది. ప్రస్తుతం ఈ హాట్ సాంగ్ వైరల్ గా మారింది. మీరు కూడా ఆర్జీవీ శారీ సాంగ్ వినేయండి..

ఇక ఈ శారీ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా ఆరాధ్య దేవి, సత్య యదు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సాంగ్ తో ఆర్జీవీ డెన్ అనే కొత్త మ్యూజిక్ ఛానల్ ని కూడా మొదలుపెట్టాడు ఆర్జీవీ. ఇకపై తన సినిమాల సాంగ్స్ అన్ని ఈ మ్యూజిక్ ఛానల్ లోనే విడుదల అవ్వొచ్చు.