Nikisha Patel: ఆర్ఆర్ఆర్ కూడా ఒక సినిమానా.. పవన్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు పాజిటివ్ గా మాట్లాడుతూ, ఇప్పటికీ ఈ సినిమాపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. అయితే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓ హీరోయిన్ మాత్రం తన అక్కసును వెల్లగక్కింది.

Nikisha Patel Shocking Comments On RRR

Nikisha Patel: ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు పాజిటివ్ గా మాట్లాడుతూ, ఇప్పటికీ ఈ సినిమాపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. అయితే భారత సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి నిరూపించిన రాజమౌళిపై ఇతర దేశంలోని ప్రేక్షకులు, సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తుంటే, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓ హీరోయిన్ మాత్రం తన అక్కసును వెల్లగక్కింది.

RRR Naatu Naatu Song: నాటు నాటు ఇంగ్లీష్ వర్షన్ చూశారా..?

పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిఖిషా పటేల్, ఆ సినిమా ఫ్లాప్‌గా మిగలడంతో మళ్లీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్‌లోనూ ఒకట్రెండు సినిమాలు చేసినా, ఫలితం లేకపోవడంతో కేవలం సెలబ్రిటీ అనే మార్క్‌ను మాత్రమే మిగిల్చుకోగలిగింది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని.. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదని ఆమె చెప్పుకొచ్చింది.

RRR: కొమురం భీముడో కాదా.. ఇది యాడ్ ఆ.. భలే సెట్ చేశారుగా!

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ లేదంటూ నిఖిషా పటేల్ ఎద్దేవా చేసింది. అయితే చూసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదంటూ తన కామెంట్స్‌ను వ్యక్త పరిచింది ఈ బ్యూటీ. ఇక నిఖిషా పటేల్ చేసిన కామెంట్స్‌కు ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు రాజమౌళి ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. తనకు సినిమాల విషయంలో సరైన అవగాహన లేదు గనకే, ఆమె హీరోయిన్‌గా రాణించలేకపోయిందంటూ పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.