Nirupam Paritala : అమ్మకు ఇష్టం లేదు.. నాన్న చనిపోయాక.. ఫస్ట్ సీరియల్ కే ఆ కండిషన్ పెట్టా.. నిరుపమ్ పరిటాల జర్నీ..

తాజాగా నిరుపమ్ పరిటాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సీరియల్స్ లోకి తన ఎంట్రీ ఎలా జరిగిందో తెలిపారు.(Nirupam Paritala)

  • Published On : April 5, 2026 / 02:04 PM IST

Nirupam Paritala

Nirupam Paritala : సీరియల్ నటుడిగా ఫేమ్ తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సినిమాతో స్టార్ అయ్యారు. తన తండ్రి ఓంకార్ పరిటాల ఒకప్పుడు రచయిత, దర్శకుడిగా, నటుడిగా అనేక సినిమాలు, సీరియల్స్ చేసారు. తాజాగా నిరుపమ్ పరిటాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సీరియల్స్ లోకి తన ఎంట్రీ ఎలా జరిగిందో తెలిపారు.

నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే వేరే దేశానికి వెళ్లి చదువుకోవాలి అనుకున్నా. కానీ ఓ రోజు సడెన్ గా నాన్న యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో అవును అని చెప్పేశా. కానీ మా అమ్మకు నేను నటన వైపు రావడం ఇష్టం లేదు. దాంతో కొంత టైం ఇచ్చి ట్రై చెయ్ సక్సెస్ అవ్వకపోతే జాబ్ చేయి అన్నారు అమ్మానాన్న. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం. నా కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. త్వరలోనే షిఫ్ట్ అయి నా సినిమా ప్రయత్నాలు మొదలుపెడదాము అనుకునేలోపు నాన్న హార్ట్ అటాక్ వచ్చి చెన్నైలోనే చనిపోయారు.

Also Read : నన్ను బిగ్ బాస్ లోకి తీసుకుంటే వాళ్లకే నష్టం.. ఏం లాజిక్ చెప్పాడు డాక్టర్ బాబు..

నాన్న చనిపోయాక హైదరాబాద్ వచ్చాము. నాకు బాధ్యతలు లేకపోవడం, ఒక్కడినే కొడుకు కావడంతో సినిమాల్లోనే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడే నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చంద్రముఖి సీరియల్ ఛాన్స్ వచ్చింది. నేను సినిమాలు అంటే సీరియల్ వచ్చింది ఏంటి అనుకున్నాను. చేయను అన్నాను. కానీ రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్, సీరియల్స్ లో కూడా లైఫ్ బాగుంటుంది అని అర్థమయ్యేలా చెప్పారు. దాంతో ఓకే చెప్పి ఆడిషన్ ఇచ్చాను. నచ్చడంతో చంద్రముఖి సీరియల్ కి నన్ను హీరోగా తీసుకున్నారు. అయితే సీరియల్ లో యాక్ట్ చేయాలి అంటే ఒక కండిషన్ పెట్టాను. నేను ఫస్ట్ డే షూటింగ్ మొదలయ్యే ముందే రాఘవేంద్రరావు గారిని కలవాలి. ఆయన్ని కలిసిన తర్వాతే షూటింగ్ కి వస్తాను అని కండిషన్ పెట్టడంతో ఓకే అని చెప్పి కలిపించారు.

అక్కడ్నుంచి సీరియల్స్ చేస్తూ వచ్చాను. చంద్రముఖి నాకు ఫస్ట్ సీరియల్. నా భార్య మంజుల కన్నడలో చేసింది అప్పటికే. తెలుగులో అదే ఫస్ట్ సీరియల్. ఆరేళ్ళు ఆ సీరియల్ సాగింది. అక్కడే కలిసాం, అక్కడే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. అప్పుడే బాబు కూడా పుట్టాడు. అప్పట్లో ఆ సీరియల్ ఒక సెన్సేషన్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నెగిటివ్ పాత్రలు చేసాను. నాకు నెగిటివ్ పాత్రలు చేయడం ఇష్టం అని తెలిపారు.

Also Read : Nirupam Paritala : కార్తీక దీపం ఫస్ట్ ఛాన్స్ నేను కాదు.. సీజన్ 2 కూడా వద్దన్నాను.. నిరుపమ్ పరిటాల సంచలన వ్యాఖ్యలు..