Kurchi MadathaPetti : గ్లోబల్ స్థాయికి పోతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఫేమ్.. ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ..

'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఫేమ్ గ్లోబల్ స్థాయికి పోతుందిగా. ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేసుకోవడం కోసం..

Nissan Motorsports International promote their new brand car with Mahesh Babu Kurchi MadathaPetti song

Kurchi MadathaPetti : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కి ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంతటి పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి.

సినిమా రిలీజ్ నాలుగు నెలలు పూర్తీ అయ్యిపోయాయి. కానీ ఈ పాట ఇంకా ట్రేండింగ్ అవుతూనే ఉంది. అదికూడా కేవలం రీజినల్ అండ్ నేషనల్ లో కాదు. ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ పాట ట్రెండ్ అవుతూ.. నాటు నాటు తరువాత ఈ పాటకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ చిందేసేలా చేస్తుంది. ఆ మధ్య కొంతమంది అమెరికన్స్ జిమ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో వర్క్ అవుట్ చేస్తూ అదరగొట్టారు.

Also read : Kalki 2898 AD : కల్కి మూవీపై హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్.. వాళ్ళు సలహా తీసుకునే స్థాయిలో లేరు..

ఆ తరువాత ఈమధ్య అమెరికా హూస్టన్ లో జరిగే నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లో.. కొంతమంది అమెరికన్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్’ (Nissan Motorsports International).. తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్ ని రిలీజ్ చేశారు.

ఇక ఆ రీల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం కుర్చీ మడతపెట్టి సాంగ్ ని ఉపయోగించడం తెలుగు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ రీల్ ని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో కుర్చీ మడతపెట్టి సాంగ్ మళ్ళీ ట్రేండింగ్ లిస్టులోకి వచ్చింది. మరి ఆ ఇన్‌స్టా రీల్ ని మీరు కూడా చూసేయండి.