Kalki 2898 AD : కల్కి మూవీపై హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్.. వాళ్ళు సలహా తీసుకునే స్థాయిలో లేరు..

కల్కి మూవీ గురించి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ తమ్ముడు 'జోనాథన్ నొలన్' ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. వాళ్ళు సలహా తీసుకునే స్థాయిలో లేరు..

Kalki 2898 AD : కల్కి మూవీపై హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్.. వాళ్ళు సలహా తీసుకునే స్థాయిలో లేరు..

Hollywood director Jonathan Nolan comments about Prabhas Kalki 2898 AD

Updated On : April 9, 2024 / 4:14 PM IST

Kalki 2898 AD : టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ సినిమాల స్థాయిలో సరికొత్త కథతో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడి’. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ పురాణాలను సైన్స్ ఫిక్షన్ జోనర్ లో చూపిస్తూ ఈ సినిమాని ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై హాలీవుడ్ మేకర్స్ లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తుంది.

తాజాగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ తమ్ముడు ‘జోనాథన్ నొలన్’ ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. జోనాథన్ నోలన్ ది ప్రెస్టేజ్, డార్క్ నైట్, ఇంటర్‌స్టెల్లెర్ వంటి సినిమాలకు రచయితగా, పలు సూపర్ హిట్ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ గా వర్క్ చేశారు. రీసెంట్ గా ఈ దర్శకరచయిత ఓ ఇండియన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయనని కల్కి సినిమా గురించి ప్రశ్నించారు.

Also read : Pushpa 2 Teaser : యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప 2 టీజర్..

“సైఫై జోనర్స్ లో మీకు సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పిరెన్స్ ఉంది. కల్కి లాంటి సినిమాకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు..?” అని ప్రశ్నించారు. దీనికి జోనాథన్ నోలన్ బదులిస్తూ.. “వాళ్ళు సలహా తీసుకునే స్థాయిలో లేరు. వాళ్ళు ఏమి చేస్తున్నారో వారికి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా సెటప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని మేకర్స్ హాలీవుడ్ కంటే గొప్పగా పని చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా ప్రాక్టీకల్‌గా, అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒక హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కల్కి సినిమా గురించి గొప్పగా మాట్లాడడంతో ఈ సినిమా పై ఇండియన్ ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని మే 30న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట.