Pushpa 2 Teaser : యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప 2 టీజర్..

యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప 2 టీజర్. 24 గంటల్లో ఈ టీజర్..

Pushpa 2 Teaser : యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప 2 టీజర్..

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Teaser records in youtube

Updated On : April 9, 2024 / 3:06 PM IST

Pushpa 2 Teaser : అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయమే. దీంతో ఈ సీక్వెల్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు చూద్దామా.. అనే క్యూరియాసిటీతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

దీంతో ఈ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చిన అది నెట్టింట ట్రేండింగా మారుతుంది. ఈక్రమంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. నిన్న ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్.. 24 గంటల్లో 85 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు 1.2 మిలియన్స్ కి పైగా లైక్స్ ని అందుకొని యూట్యూబ్ ట్రేండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది.

Also read : Mamitha Baiju : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు.. ఏకంగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Teaser records in youtube

ఇక ఈ మూవీకి ఉన్న క్రేజ్ కి థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. నైజంలో అయితే ఈ పోటీ చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈక్రమంలోనే కేవలం నైజం హక్కులను సొంతం చేసుకోవడం కోసమే 100 కోట్ల వరకు పోటీ వెళ్లిందట. ఈ బేరం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

మరి ఒక్క నైజంలోనే ఇలా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అన్ని కలిపి 300 కోట్ల మార్క్ ని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఈ మూవీని ఆగష్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విడుదల తేదీ లాంగ్ వీకెండ్ తో రాబోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.