Mamitha Baiju : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు.. ఏకంగా విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..
విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అవ్వడంతో శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు.

Premalu Beauty Mamitha Baiju will Play Female Lead in Vijay Deverakonda Gowtam Tinnanuri Movie Rumours Goes Viral
Mamitha Baiju : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫ్యామిలీ స్టార్ సినిమా మెప్పిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉంది. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
అయితే ఈ సినిమాలో శ్రీలీలని(Sreeleela) హీరోయిన్ గా అనౌన్స్ చేసి ఆల్రెడీ పూజా కార్యక్రమాలు కూడా జరిపించారు. కానీ విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేశాడు. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ముందు చేయడంతో గౌతమ్ తిన్ననూరి సినిమా లేట్ అవ్వడంతో శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదు. ప్రస్తుతం శ్రీలీల వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం, MBBS చివరి దశలో ఉండటంతో దానికి సంబంధించిన వర్క్స్.. ఇలా శ్రీలీల చాలా బిజీగా ఉండి ఇప్పుడు విజయ్ – గౌతమ్ తిన్ననూరి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా నుంచి తప్పుకుంది.
Also Read : A Master Piece : తెలుగులో మరో ‘సూపర్ హీరో’ సినిమా.. ‘A మాస్టర్ పీస్’.. ఈసారి శివుడితో..
దీంతో శ్రీలీల ప్లేస్ లో వేరే హీరోయిన్ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వినపడ్డాయి. తాజాగా మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు(premalu) సినిమా తెలుగులోరిలీజవ్వడంతో మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ అయింది. ఇప్పుడు మమిత బైజు విజయ్ దేవరకొండ సరసన గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటించబోతుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. మమిత బైజు ప్రేమలు సినిమాతో తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో క్యూట్ నటనతో అందర్నీ మెప్పించింది. దీంతో ఏకంగా మమిత బైజు డైరెక్ట్ తెలుగు ఎంట్రీ విజయ్ దేవరకొండ సరసన అని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మమిత బైజు సూపర్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.