Nithiin Birthday Special his Next Movie Title Thammudu Revealed and Poster Released
Nithiin : హీరో నితిన్ వరుస ఫ్లాప్స్ నుంచి ఇంకా బయటకు రాలేదు. గత సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కుడా పరాజయం పాలైంది. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా రాబోతుంది.
గత సంవత్సరం ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి వర్క్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. గతంలో ఈ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘తమ్ముడు’ అని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేసారు చిత్రయూనిట్. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
నేడు నితిన్ పుట్టిన రోజు కావడంతో తన నెక్స్ట్ సినిమా టైటిల్ ‘తమ్ముడు’ అని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసిందే. నితిన్ సినిమాల్లో పవన్ రిఫరెన్స్ లు ఉంటాయి. గతంలో నితిన్ సినిమా ఈవెంట్స్ కి పవన్ కూడా గెస్టుగా వచ్చారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు పవన్ టైటిల్ తో నితిన్ సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
A story of ambition, courage, and determination?
Presenting the passion-filled first look of #THAMMUDU ❤️?
Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️?#HBDNithiin
A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ
— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024