Robinhood Twitter Review : నితిన్ ‘రాబిన్‌హుడ్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. డేవిడ్ వార్న‌ర్ రోల్ ఇదే!

నితిన్ హీరోగా న‌టించిన రాబిన్‌హుడ్ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Robinhood Twitter Review

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన చిత్రం రాబిన్‌హుడ్‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టించ‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని నవీన్, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ సినిమాల‌పై అంచ‌నాల‌ను పెంచ‌గా, నేడు (మార్చి 28న‌) ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌తో పాటు ప‌లు చోట్ల ఫ‌స్ట్ షోలు ప‌డిపోయాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. సినిమా ఎలా ఉంది ? డేవిడ్ భాయ్ ఎలా న‌టించాడు అన్న విష‌యాల‌ను తెలియ‌జేస్తున్నారు.

నితిన్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల‌కిషోర్ కాంబోలో కామెడీ అదిరిపోయింద‌ని అంటున్నారు. ఇక డేవిడ్ వార్న‌ర్ క్యామియో రోల్ ఆఖ‌రిలో న‌వ్వులు పూయిస్తోంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు.