Nithiin Sreeleela Extra Ordinary Man movie teaser released
Extra Ordinary Man Teaser : టాలీవుడ్ ప్రముఖ రైటర్ వక్కంతం వంశీతో కలిసి నితిన్ చేస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే మారేడుమిల్లి అడవుల్లో స్టార్ట్ చేయడం, నితిన్ గుబురు గడ్డం లుక్స్ తో కనిపించడంతో.. ఈ సినిమా పక్కా మాస్ మూవీ అనుకున్నారు. అయితే దానికి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే క్లాస్ టైటిల్ ని అనౌన్స్ చేసి ఆడియన్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. ఇక ఇప్పుడు టీజర్ తో మూవీ లైన్ ఏంటనేది తెలియజేశారు. ఈ సినిమాలో నితిన్ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈక్రమంలోనే టీజర్‌లో.. బాహుబలి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌ల్లో నేను కూడా ఉన్నానని నితిన్ చెప్పడం, పేస్ మార్ఫ్ చేసి నితిన్ ని బాహుబలిలో చూపించడం ఆడియన్స్ ని నవ్విస్తుంది.
Also read : VarunLav : వరుణ్ తేజ్ పెళ్లికి నాయనమ్మ అంజనా దేవి హాజరుకావడం లేదా..?
టీజర్ అయితే ఎంటర్టైనింగ్ గా కనిపిస్తుంది. డిసెంబర్ 8న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. కాగా వక్కంతం వంశీ, నితిన్ ప్రస్తుతం ఇద్దరు ప్లాప్‌ల్లో ఉన్నారు. మరి ఈ చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..? లేదా..? చూడాలి.