బ్రహ్మచారి పేరు లవర్ బోయ్‌కి పెడతారా.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్..
విడుదలకు సిద్ధమవుతున్న నితిన్ ‘భీష్మ’ చిత్రం వివాదంలో చిక్కుకుంది..

విడుదలకు సిద్ధమవుతున్న నితిన్ ‘భీష్మ’ చిత్రం వివాదంలో చిక్కుకుంది..
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఊహించని విధంగా ‘భీష్మ’కు చిక్కొచ్చిపడింది. మహాభారతంలో భీష్ముడి పేరుని సినిమా టైటిల్‌గా పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదనను వ్యక్తం చేసింది. టైటిల్ మార్చాలని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణ చైతన్య, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము తదిరతులు డిమాండ్ చేశారు.
ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరుని లవర్‌బోయ్ పాత్రకు పెట్టడం ఏంటని సదరు సభ్యులు ఆరోపించారు. టైటిల్‌ను మార్చాలని లేకుంటే సినిమాను అడ్డుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు. గతంలోనూ పలు సినిమాల టైటిల్స్ విషయంలో ఇలాంటి వివాదాలు ఎదరుయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ టైటిల్ ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని ఆందోళన చేపట్టగా చివరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్’ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘భీష్మ’ విషయంలో దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read More>>త్రివిక్రమ్ తో తారక్ 30 – 2021 వేసవిలో విడుదల!