Nitin Offered Pizza To Keerthi Suresh To Eat Cheat Meal During Rangde Movie Shoot
Nitin Offered Pizza to Keerthi Suresh : సినీనటి కీర్తి సురేష్ పిజ్జా కోసం డైట్ వదిలేసింది.. హీరో నితిన్ పిజ్జాతో ఊరిస్తుంటే ఆగలేక డైట్ ప్లాన్ పక్కన పెట్టేసి పిజ్జా ఆరంగించేసింది. డైట్ చేస్తున్న కీర్తి ఫ్రూట్స్ తింటుంటే.. నితిన్ పిజ్జా తీసుకొచ్చాడు.
మొదట పిజ్జాని చూడగానే నోరు ఊరినప్పటికీ కీర్తి కంట్రోల్ చేసుకుంది. నితిన్ పదేపదే తన నోటి దగ్గర పెట్టి ఊరిస్తుంటే ఆగలేక కాసేపు డైట్ ప్లాన్ పక్కన పెట్టేసింది.. పిజ్జా పీసులను ఒక్కసారిగా లాగించేసింది. వీరిద్దరి ఫన్నీ మూమెంట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
నితిన్- కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.