Nivar Cyclone : వరద ప్రాంత ప్రజలకు ప్రకాష్ రాజ్ సాయం

  • Publish Date - November 25, 2020 / 09:00 PM IST

Nivar Cyclone – Prakashraj: నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. NDRF బృందాలనూ రంగంలోకి దింపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.




ప్రజలకు తమవంతు సాయమందించడానికి ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ రంగంలోకి దిగింది. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు జిల్లాలోని కోవలం గ్రామంలో ప్రజలకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే భారీ వర్షాలకు రోడ్లు, వాహనాలపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు.


తమ పొరుగింట్లో ఉండే సుందరం నేతృత్వంలోని స్కోప్ ఎంటర్‌ప్రైజ్, స్థానిక యువకులు మరియు ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ సభ్యులు కలిసి వారికి సాయమందిస్తున్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలోనూ ప్రకాష్ రాజ్ తన వంతు సాయం చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన వలస కూలీలకు తన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం కల్పించారు.