Venkatesh : ఆలయాలకు వెళ్లడం ఆపేసిన వెంకీమామ.. ఎందుకో తెలుసా?

వెంకటేష్ అసలు టెంపుల్స్ కి వెళ్లడమే మానేశారట. (Venkatesh)

  • Published on- November 10, 2026 / 03:53 PM IST

Venkatesh

Venkatesh : వెంకటేష్ చాలా భక్తి ఉన్న వ్యక్తి అని, లైఫ్ లెస్సన్స్ ఎక్కువగా చెప్పే, ఫిలాసఫర్ వ్యక్తి అని అందరికి తెలిసిందే. తన సోషల్ మీడియాలో కూడా రోజూ ఉదయాన్నే ఒక మంచి కొటేషన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలలో, బయట ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడతారు. రమణమహర్షిని ఎక్కువగా నమ్ముతారు. ఇంత భక్తి ఉన్న వ్యక్తి రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్తాడు అనే అనుకుంటారు.

కానీ వెంకటేష్ అసలు టెంపుల్స్ కి వెళ్లడమే మానేశారట. ఇటీవల హీరోయిన్ నివేత పేతురాజ్ ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ గురించి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Also Read : Anna Lezhneva Net Worth: అన్నా లెజినోవా ఆస్తుల విలువ 1800 కోట్లా?

నివేత పేతురేజ్ మాట్లాడుతూ.. వెంకటేష్ గారు భక్తి, లైఫ్ గురించి చాలా మాట్లాడతారు. ఆయనతో పది నిముషాలు మాట్లాడగానే తెలిసిపోతుంది ఆయన గురించి. ఆయన టెంపుల్స్ కి వెళ్లడం ఆపేసాను అని చెప్పారు. ఆయన టెంపుల్ కి వెళ్తే VIP దర్శనానికి వెళ్ళాలి. దానివల్ల వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుమల లాంటి ప్రదేశాలలో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అందర్నీ దాటేసి ముందుకు వెళ్లడం వాళ్లకు ఒక అడ్డంకి లాంటింది. వాళ్లంతా ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్లందరికీ ఆటంకం కలిగించకూడదు అని టెంపుల్స్ కి వెళ్లడం ఆపేసానని వెనకటేష్ చెప్పినట్టు తెలిపింది.

సామాన్య జనం కోసం తను ఆలయాలకు వెళ్లడం మానేసాడు అని తెలిసి వెంకటేష్ ని మరోసారి అభినందిస్తున్నారు.