Romantic: నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. రొమాంటిక్ ట్రైలర్ అదిరిందంతే!
నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. ఇది రొమాంటిక్ ట్రైలర్ గురించి చెప్పాలంటే. ట్రైలర్ లో చెప్పిన రమ్యకృష్ణ మాటలే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది చెప్తుంది. ఈ కాలంలో ఆడ, మగ మధ్య మొహానికి..
- Naresh Mannam
- Updated on- October 19, 2021 / 04:57 PM IST
Romantic
Romantic: నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. ఇది రొమాంటిక్ ట్రైలర్ గురించి చెప్పాలంటే. ట్రైలర్ లో చెప్పిన రమ్యకృష్ణ మాటలే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది చెప్తుంది. ఈ కాలంలో ఆడ, మగ మధ్య మొహానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటున్నారు. కానీ.. ఇందులో హీరో, హీరోయిన్లు ప్రేమనే మొహమనే భ్రమలో ఉన్నారు. పూరి బాషలో చెప్పాలంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఎదో తేడాగా ఉంది. పూరీ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు.
Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!
అయితే, ఆయన తనయుడు ఆకాష్ పూరి మాత్రం సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా ఈ సినిమాకి రచయిత పూరీనే. రిలీజ్ కు సిద్దమైన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేశారు.
Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్గ్రీన్ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!
అక్టోబర్ 29న విడుదల కానున్న ఈ సినిమాకు బూస్టప్ కోసం ప్రభాస్ ను ఎంచుకున్నారు. అయితే.. ట్రైలర్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు. ఈ సినిమా కూడా యూత్ ఫుల్ సినిమాగానే కనిపిస్తుంది. ఆకాష్ పూరీ సరసన కేతికా శర్మ గ్లామర్ సినిమాకు అసెట్ కానుండగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటులు కూడా ప్లస్ పాయింట్. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిదే కాగా సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఎటు చూసినా అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తున్న ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
