Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!

అనన్య ఓ అద్భుతం.. సినిమా కోసం తాను పడే కష్టం చూస్తే ముచ్చటేస్తుంది. లైగర్ సినిమాలో అనన్య నటన నచ్చనివాళ్ళు ఉండరు. ఇదీ బాంబే బ్యూటీ హీరోయిన్ అనన్య పాండే గురించి మన రౌడీ హీరో విజయ్..

Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!

Liger

Updated On : October 19, 2021 / 5:11 PM IST

Liger: అనన్య ఓ అద్భుతం.. సినిమా కోసం తాను పడే కష్టం చూస్తే ముచ్చటేస్తుంది. లైగర్ సినిమాలో అనన్య నటన నచ్చనివాళ్ళు ఉండరు. ఇదీ బాంబే బ్యూటీ హీరోయిన్ అనన్య పాండే గురించి మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రశంస. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది.

Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ అనన్య పాండే పై ప్రశంసలు కురిపించారు. అనన్య చాలా మంచి అమ్మాయి. ఆమెను తెలుగు సినిమాల్లో చూడాలని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మా సినిమాలో అనన్య చాలా బాగా నటించిందని చెప్పాడు. ఈ సినిమా సంగతుల గురించి చెప్పిన విజయ్.. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరూ ఒక్కరూ కష్టపడి పని చేస్తున్నారని.. అది మీకు సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద తెలుస్తుందని చెప్పాడు.

sankranti 2022: ఇప్పటికే టఫ్‌ఫైట్.. అయినా బంగార్రాజు సై?

ఈ సినిమా కోసం మేకర్స్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను కూడా తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన విజయ్.. బాక్సింగ్ సూపర్ స్టార్‌ని పెద్ద స్క్రీన్‌లపై చూడటం ఇదే మొదటిసారని.. దాని కోసం లైగర్ మేకర్స్ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. నిజానికి మైక్ టైసన్ ను తమ సినిమాలలో నటించాలని గతంలో బాలీవుడ్ లో చాలామంది ప్రయత్నించారు. కానీ.. అది అప్పుడు వర్క్ అవుట్ కాలేదు. కానీ ఇప్పుడు ఇలా తమ సినిమాతో ఆయన సిల్వర్ స్క్రీన్ మీదకి రావడం ఆనందంగా ఉందని విజయ్ చెప్పాడు.