Bigg Boss 4: ఈ వారం నో ఎలిమినేషన్!..

  • Publish Date - October 4, 2020 / 04:02 PM IST

Bigg Boss 4 Telugu: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్‌బాస్ సీజన్ 4’ ప్రారంభంలో కాస్త నిరుత్సానికి గురి చేసినా రాను రాను మరింత ఎంటర్ టైన్‌‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్స్ అందరూ ఒకరినిమించి ఒకరు పోటీపడుతూ ఎంటర్‌టైన్ చేయడం, నాగ్ వారికి డిఫరెంట్ టాస్క్స్ ఇవ్వడంతో ఐపీఎల్ సమయంలోనూ సత్తా చాటుతుంది బిగ్‌బాస్..


సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే డైరెక్టర్ సూర్య కిరణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, టీవీ 9 దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
https://10tv.in/how-devi-nagavalli-is-related-to-dasari-narayana-rao/

కట్ చేస్తే.. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరూ బయటకు రావడంలేదని సమాచారం. ఏం జరుగుతోందనని ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెరగడంతో పాటు ప్రస్తుతం షో మంచి రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది.