నిర్మాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

  • Publish Date - November 19, 2020 / 02:22 PM IST

National Importance Films: మూవీ మేకర్స్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జాతీయ ప్రాముఖ్యత గల సినిమాలకు సెంట్రల్‌ ఆర్కియాలజీ శాఖ నుండి కేంద్రం ఓ వెసులుబాటు కల్పించింది. సాధారణంగా ఇప్పటి వరకు చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరించే సినిమాలకు లొకేషన్ విషయంలో కొంత ఫీజు చెల్లించాల్సి వచ్చేది. కానీ డిసెంబర్‌ 25, 2020 నుండి ఆగస్ట్‌ 15, 2021 వరకు హిస్టారికల్ ప్లేసెస్‌లో చారిత్రాత్మక ప్రదేశాల్లో షూటింగ్స్‌ చేసుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


ఇది కేవలం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా స్మారక చిహ్నాలలో షూటింగ్‌ కోసం రుసుము చెల్లించడంలో మినహాయింపు ఇస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు.



https://10tv.in/actor-akshay-kumar-served-a-defamation-notice-to-a-youtuber/
మాజీ ప్రధాని అటల్‌ బీహారి వాజ్‌పేయ్‌ పుట్టినరోజు(డిసెంబర్‌ 25) నుండి వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ మినహాయింపు వర్తిస్తుంది అని మంత్రి తెలిపారు. కేంద్రప్రభుత్వ ప్రకటనతో నిర్మాతలకు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు.