Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ రేపటి నుంచే.. ప్రోమో అదరగొట్టిన నాగ్!
మళ్ళీ బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఉండబోతుంది. ఈ శనివారం ఫిబ్రవరి 26 నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకానుంది.
- Naresh Mannam
- Published On : February 25, 2022 / 04:56 PM IST
Bigg Boss Ott Telugu
Bigg Boss OTT Telugu: మళ్ళీ బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఉండబోతుంది. ఈ శనివారం ఫిబ్రవరి 26 నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకానుంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదల చేయగా.. ఈ ప్రోమోతో 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం కానుందని చెప్పేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుండగా.. తాజాగా మరో ఓ ప్రోమో రిలీజ్ చేశారు. గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది.
Bigg Boss: నాన్ స్టాప్ బిగ్‌బాస్.. 24గంటల ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రోమో వచ్చేసింది
ఈ ప్రోమోలో ఓటీటీ బిగ్ బాస్ ఇంటిని చూపించిన షో యాజమాన్యం ఈ షోకు నాగార్జునే హోస్ట్ అని చెప్పకనే చెప్పేశారు. ప్రోమో నాగార్జున హౌస్‌లోకి వెళ్లి.. ఇప్పటివరకు టీవీలో బిగ్‌బాస్ గంటమాత్రమే చూశారు, ఇప్పుడు గ్యాప్ లేకుండా హాట్‌స్టార్‌లో చూసేయండి అని చెప్పుకొచ్చాడు. ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తవగా ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bigg Boss Telugu OTT: నాగార్జున కాదా?.. న్యూ హోస్ట్‌గా యాంకర్ రవి?
పాత కొత్త కంటెస్టెంట్ల కలయికలో ఈ ఓటీటీ తొలి సీజన్ బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది. కొత్తగా.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
Starts Tomorrow @ 6:00 pm#BiggBossNonStop filled with Nonstop fun and full of entertainment @DisneyPlusHSTel
Add to your watchlist @DisneyPlusHS https://t.co/81KGHg75Ph
— Starmaa (@StarMaa) February 25, 2022
