Bigg Boss: నాన్ స్టాప్ బిగ్‌బాస్.. 24గంటల ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రోమో వచ్చేసింది
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎంటర్‌టైన్ చెయ్యడానికి మళ్లీ వచ్చేస్తోంది.

Nagarjuna
Bigg Boss: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎంటర్‌టైన్ చెయ్యడానికి మళ్లీ వచ్చేస్తోంది. నాన్ స్టాప్ అంటూ షో నిర్వాహకులు ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ ‘షో’కి సంబంధించిన ప్రొమోలో నాగార్జునతోపాటు వెన్నెల కిషోర్, మురళీశర్మ సందడి చేశారు.
నాన్‌స్టాప్ బిగ్‌బాస్‌పై అంచనాలను ప్రోమో తర్వాత భారీగా పెరగిపోయాయి. ప్రోమోలో నాగార్జున లాయర్‌గా కనిపించగా.. ఉరి శిక్ష పడిన ఖైదీగా వెన్నెల కిషోర్ నటించాడు. ఉరితీసేందుకు తీసుకెళ్లే అధికారిగా మురళీశర్మ నటించారు. ఈ సమయంలో చివరికోరిక ఏదైనా ఉందా అని అడగ్గా.. వెన్నెల కిషోర్ తరుపున లాయర్ నాగార్జున బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ చూస్తాడని చెప్పడంతో గంటలోనే అయిపోతుంది కదా? అనుకుని ఒప్పుకుంటాడు.
ఎంతసేపటికి బిగ్ బాస్ పూర్తి కాకపోవడంతో వెన్నెల కిషోర్ ఉరి నుంచి తప్పించుకుంటాడు. ఇకపై బిగ్ బాస్ ఇంటి నుంచే నాన్‌స్టాప్ 24గంటల ఎంటర్‌టైన్‌మెంట్ అని నాగార్జున చివరిలో చెబుతాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈసారి బిగ్‌బాస్ టెలికాస్ట్ కాబోతుంది. ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు కొత్తవారు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.