RRR: ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి వీడియోల వరకు సినిమా మీద అంచనాలను పెంచేసింది. దీంతో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అతృతతో ఉన్నారు. అయితే.. ప్రేక్షకుల ఆతృతకు తగ్గట్లే సినిమా కూడా వాయిదా పడి మరింత నీరక్షణ తప్పేలా కనిపించడం లేదు.
అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని ఇప్పటి వరకు యూనిట్ చెప్తూ వచ్చింది. బహుశా ఇది సాధ్యం కాదని లెక్కలేసి చెప్పినా యూనిట్ ఇప్పటి వరకు మౌనంగానే తన పని తాను చేసుకుపోతుంది. అయితే, యూనిట్ చెప్పిన డేట్ ప్రకారం విడుదల తేదీకి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుండగా మిగిలిన రెండు నెలలలో సినిమా పూర్తయి విడుదల వరకు వెళ్లగలదా అనే సందేహాలు తప్పక వినిపిస్తున్నాయి.
అయితే, అందుకు తగ్గట్లే ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు మరో వాయిదాకు సిద్ధపడినట్లుగా తెలుస్తుంది. సినిమాకి బ్యాలన్స్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని నిర్ణయించుకున్న మేకర్స్ వచ్చే ఏడాదికి ఉగాదికి విడుదలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు ఫిక్స్ అయిపోగా ఇప్పుడు వాటిని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేకనే సంక్రాంతి బరిలో కాకుండా ఉగాదికి తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. త్వరలోనే ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట.