లాలూ బయోపిక్ వస్తోంది!

బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్యక్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ జీవిత‌గాథ‌ను ‘లాన్‌టెన్‌’ (లాంత‌రు) పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నారు..

  • Publish Date - October 31, 2019 / 10:05 AM IST

బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్యక్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ జీవిత‌గాథ‌ను ‘లాన్‌టెన్‌’ (లాంత‌రు) పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నారు..

బాలీవుడ్‌లో గతకొద్ది కాలంగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినిమా, స్పోర్ట్స్ మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలతో బయోపిక్స్ వచ్చాయి.. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇప్పుడు బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధ్యక్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ జీవిత‌గాథ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. ‘లాన్‌టెన్‌’ (లాంత‌రు) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో లాలూ ప్ర‌సాద్‌గా భోజ్‌పురి న‌టుడు య‌శ్ కుమార్ న‌టిస్తుండ‌గా, ర‌బ్రీదేవి పాత్ర‌లో స్మ‌తి సిన్హా న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. లాలూ పార్టీ గుర్తు కూడా లాంతరు కావడం విశేషం.. త్వరలో లాలూ బయోపిక్ ‘లాన్‌టెన్‌’ షూటింగ్ ప్రారంభం కానుంది.