Bigg Boss 5: ఇప్పుడు నేను ఏడవాలా.. షణ్నూకి ముద్దుపై సిరి లవర్!

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్లు బీబీ హౌస్ నుండి బయటకి వెళ్లేకొద్దీ షోలో డోస్ పెంచుతున్నాడు బిగ్ బాస్. ఎనిమిదో వారంలో ఇచ్చిన టాస్కులు రిస్కులతో..

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్లు బీబీ హౌస్ నుండి బయటకి వెళ్లేకొద్దీ షోలో డోస్ పెంచుతున్నాడు బిగ్ బాస్. ఎనిమిదో వారంలో ఇచ్చిన టాస్కులు రిస్కులతో కూడుకున్నవే కాదు.. ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఇంట్లో సభ్యులు తగ్గడంతో ఉన్న సభ్యులతోనే అన్ని రకాల మసాలాలు ఉండేలా చూసుకుంటున్నాడు. అన్ని మసాలాలో ఒకటే షణ్ముఖ్ కు సిరి ముద్దుపెట్టడం. ఇదే ఇప్పుడు బిగ్ బాస్ పై హాట్ టాపిక్ గా మారింది.

Bigg Boss 5 : ఎట్టకేలకు కెప్టెన్ అయిన షన్ను.. ఆనందంలో అభిమానులు

ఎందుకంటే షణ్ముఖ్, సిరి ఇద్దరూ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నారు. షణ్ముఖ్ తన సహా యూట్యూబ్ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయనతో ప్రేమలో ఉండగా.. సిరి తన సహా నటుడు శ్రీహన్ తో రిలేషన్ లో ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఓ బిడ్డను కూడా దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు సిరి షణ్ముఖ్ ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి.

Bigg Boss 5: వెక్కి వెక్కి ఏడ్చిన కంటెస్టెంట్లు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు!

ముందుగా మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతామని షణ్నూ సిరికి హితభోద చేస్తుండగా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని సిరి బదులిచ్చింది. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షణ్నూ డైలాగ్ వదిలాడు. తర్వాత ఏమైందో కానీ సిరి లేచి వెళ్లి షణ్నూకి నుదిటి మీద ముద్దు పెట్టింది. దీంతో షణ్నూ కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్‌ చేశారా.. నాకు ఉంటదిపుడు అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. మొత్తంగా ఈ ప్రోమో హైలెట్ అయింది.

Bigg Boss 5: సన్నీ ఆ హక్కు నీకే ఉంది.. ప్రియా ఎమోషనల్ కామెంట్స్!

సిరి ముద్దు పెట్టడంపై పలువురు నెటిజన్లు ట్రోల్ చేయడం.. మెస్సేజ్ లు చేయడంతో ఆమె లవర్ శ్రీహన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేను ఏడవాలా.. షార్ట్‌ ఫిల్మ్స్‌, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఒకవిధంగా ఇది సిరికి మద్దతుగానే అనిపిస్తున్నా.. నెటిజన్ల ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. శ్రీహన్ పెట్టిన ఇన్ స్ట స్టేటస్ ను కూడా స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.