NTR 30 : తారక్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో పూజ..
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది..
- sekhar
- Published On : November 9, 2021 / 10:54 AM IST
Ntr 30
NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 2022 జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు జక్కన్న.
RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..
తర్వాత తారక్ – తనకు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చెయ్యబోతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.
Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే 2022 ఫిబ్రవరిలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. దసరా కానుకగా విడుదల చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల కలయికలో కొరటాల తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.
