Harikrishna Jayanthi : హరికృష్ణ జయంతి.. నారా – నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు..

సెప్టెంబర్ 2న హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా.. నారా - నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు..

Harikrishna

Harikrishna Jayanthi: నటుడిగా, చైతన్య రథసారథిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్పవ్యక్తి.. టైగర్, సాహసరత్న నందమూరి హరికృష్ణ. ఆగస్ట్ 29, 2018న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందారు.

సెప్టెంబర్ 2న హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా నారా – నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్, నారా రోహిత్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హరికృష్ణను స్మరించుకున్నారు.

తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ.. ‘‘ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ భావోద్వేగభరితమైన ట్వీట్స్ చేశారు.