NTR – Nagavamsi : ఆ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్, నాగవంశీ.. వార్ 2 బాలీవుడ్ సినిమా కాదు అని నొక్కి మరీ చెప్పడంతో..

వార్ 2ని ఒక హిందీ సినిమాగానే తెలుగులో చూస్తున్నారు.

NTR - Nagavamsi

NTR – Nagavamsi : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది. గతంలో మన తెలుగు నటీనటులు, దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసినా అవి బాలీవుడ్ సినిమాలుగానే చూసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తప్ప హీరో, దర్శక నిర్మాతలు, హీరోయిన్ , సాంకేతిక సిబ్బంది అంతా బాలీవుడ్. దీంతో వార్ 2 బాలీవుడ్ సినిమానే అని అందరూ అంటున్నారు.

వార్ 2 రిలీజ్ రోజే రజినీకాంత్ కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున మెయిన్ విలన్ చేస్తుండటం, రజినీకాంత్ ఎంత తమిళ్ అయినా తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై సినీ ప్రేమికులకు నమ్మకం ఉంది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఉన్నారు. దీంతో తెలుగులో వార్ 2 కంటే కూడా కూలీ కే ఎక్కువ హైప్ ఉంది. టికెట్ సేల్స్ కూడా కూలీకి ఎక్కువే ఉన్నాయి.

Also Read : NTR Fan : 10 టీవీ చొరవ.. దూరం నుంచి వచ్చిన మూగ అభిమానిని కలిసిన ఎన్టీఆర్.. ఫొటోలు, వీడియోలు వైరల్..

ఈ విషయంలో పలువురు వార్ 2 బాలీవుడ్ సినిమా, ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి నటించాడు అని, అది తెలుగులో రిలీజయినా హిందీ డబ్బింగ్ సినిమానే అని, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా ఉన్నాడు, మన ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో సినిమాలో అని కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ సినిమాని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. భారీ ధరకు తెలుగు రైట్స్ కొన్నారు నాగవంశీ. వార్ 2ని ఒక హిందీ సినిమాగానే తెలుగులో చూస్తున్నారు.

దీంతో నిన్న జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ, ఎన్టీఆర్ ఇది హిందీ సినిమా కాదు, సినిమా అదిరిపోతుంది అంటూ కొంచెం గట్టిగానే చెప్పారు.

Also Read : War 2 Pre Release Event : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు..

ఎన్టీఆర్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇది అందరూ అన్నట్టు ఎన్టీఆర్ హిందీకి వెళ్లిన సినిమా కాదు. హృతిక్ తెలుగుకు వచ్చిన సినిమా. ఎవరెన్ని మాట్లాడుకున్నా పర్లేదు బొమ్మ అదిరిపోయింది, పండగ చేసుకోండి అంటూ రెండు కాలర్స్ ఎత్తారు.

ఇక నాగవంశీ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ ని హిందీ సినిమాకు తీసుకెళ్లినట్టు లేదు. హృతిక్ ని తెలుగు సినిమాకు తీసుకొచ్చినట్టు ఉంది కదా వైబ్. రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమా అని అంటే ఇదే చెప్పండి. లిప్ సింక్ తో సహా ప్రాపర్ గా ఉంటుంది. ఇది తెలుగు సినిమా. ఇది ప్రాపర్ తెలుగు సినిమా. హృతిక్ ని తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాం. ఎన్టీఆర్ అన్న పవర్ ఇండియా అంతా చూపించాలి అంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.

Also Read : NTR : నా అభిమాని ప్రాణం కోల్పోయాడు.. అప్పట్నుంచి కొంచెం దూరంగా ఉన్నాను..

ఇలా ఎన్టీఆర్, నాగవంశీ ఇద్దరూ వార్ 2 తెలుగు సినిమా, డబ్బింగ్ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా కాదు, హృతిక్ నే తెలుగులోకి తీసుకొచ్చాం అంటూ నొక్కి మరీ చెప్పడంతో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి వార్ 2 ఏ రేంజ్ లో తెలుగులో కలెక్ట్ చేస్తుందో చూడాలి.