NTR Cousin Narne Nithiin Says his First Movie Sri Sri Sri Rajavaru Shelved
Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్దిగా నార్నె నితిన్ టాలీవుడ్ కి పరిచయం అవుతూ శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాని ప్రకటించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండానే మ్యాడ్ సినిమాతో నార్నె నితిన్ ప్రేక్షకులని పలకరించాడు. మ్యాడ్ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ అని అందరికి గుర్తుండిపోయాడు. ఇప్పుడు త్వరలో ఆగస్టు 15న ఆయ్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు నితిన్. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఆల్రెడీ మ్యాడ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆయ్ సినిమా రాబోతుంది కానీ అసలు నార్నె నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు మాత్రం ఇంకా రాలేదు. ఇటీవల సంక్రాంతికి ఆ సినిమా నిర్మాత ఆల్రెడీ సినిమా రెడీ అయింది, త్వరలోనే శ్రీశ్రీశ్రీ రాజావారు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో నార్నె నితిన్ మీడియాతో మాట్లాడగా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా ప్రస్తావన రావడంతో ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు.
Also Read : TG Vishwaprasad : నేను రాజకీయాల్లోకి రాను.. పవన్ సన్నిహితుడు, నిర్మాత వ్యాఖ్యలు.. ఎందుకంటే..
నిర్మాత ఏమో త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తే, హీరో ఏమో ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని చెప్పడం చర్చగా మారింది. మరి ఇంతకీ ఆ శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మాణంలో వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ప్రకటించారు.