Devara : ఎన్టీఆర్ ‘దేవర’కు పోటీగా స్టార్ హీరోల సినిమాలు.. దేవర పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా?

దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. అదే టైంకి తమిళ్ భారీ ప్రాజెక్టు సూర్య 'కంగువ'(Kanguva) సినిమా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృధ్విరాజ్ సుకుమారన్ 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా కూడా రానున్నాయి.

NTR Devara Movie Huge Clash with Kanguva and Bade Miyan Chote Miyan Movies in Pan India Market

Devara : ఎన్టీఆర్(NTR) RRR తర్వాత కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆల్రెడీ దేవర సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా దేవర తెరకెక్కబోతుంది.

దేవర సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారని తెలిసిందే. అందులోను RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా. దీంతో భారీ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దేవర ఇండియా వైడ్ బరిలోకి దిగాలనుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దేవరకు పోటీగా ఏ సినిమా ప్రకటించకపోయినా పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం దేవరకు పోటీ ఎదురయ్యేలా ఉంది.

దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. అదే టైంకి తమిళ్ భారీ ప్రాజెక్టు సూర్య ‘కంగువ'(Kanguva) సినిమా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృధ్విరాజ్ సుకుమారన్ ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా కూడా రానున్నాయి. తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya), మాస్ డైరెక్టర్ శివ కంబినేషనల్ లో భారీగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కంగువ’ ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా అంచనాలు ఉన్నాయి. కంగువ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కంగువ కూడా ఏప్రిల్ 5కే రానుందని సమాచారం.

Also Read : PM Modi : కుష్బూ అత్త గారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న ప్రధాని మోదీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఇక బడే మియాన్ చోటే మియాన్(Bade Miyan Chote Miyan) సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు. ఈ సినిమాని రంజాన్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 9 మంగళవారం రంజాన్ వచ్చింది. అంటే దాని ముందే ఈ సినిమా ఏప్రిల్ 5 శుక్రవారం రాబోతుందని తెలుస్తుంది. ఏప్రిల్ 5 సినిమాలు రిలీజ్ చేస్తే శుక్రవారం, వీకెండ్ రెండు రోజులు, సోమవారం, మంగళవారం రంజాన్.. ఇలా అయిదు రోజులు కలెక్షన్స్ వస్తాయని అంచనా. దేవర సోలోగా వచ్చి పాన్ ఇండియా దుమ్ము దులిపేద్దాం అనుకుంది. కానీ ఈ రెండు సినిమాలు తోడవడంతో తమిళ్, కేరళ, బాలీవుడ్ లో దేవరకు గట్టి పోటీ ఉంటుంది. తెలుగు, కన్నడలో మాత్రం దేవర మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుందని తెలుస్తుంది. అప్పటిదాకా చూడాలి మరి ఏం జరుగుతుందో..