Devara : బాక్సాఫీస్ వ‌ద్ద దేవ‌ర దూకుడు.. వారం రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మూవీ దేవ‌ర‌.

NTR Devara Movie Seven Days World Wide Collections

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మూవీ దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయ‌ర్ రోల్‌లో అద‌ర‌గొట్టారు. ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.

ఈ మూవీకి ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. ఇదే జోరును కొన‌సాగిస్తే ద‌స‌రా వ‌ర‌కు ఈ చిత్రం రూ.500 కోట్ల క్ల‌బ్‌ను చేరుకోనుంది. ఇక నిన్న (గురువారం) సాయంత్రం పార్క్ హయత్ లో ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మిక్కిలినేని సుధాకర్, నాగ వంశీ కలిసి పార్టీ ఇచ్చారు.

Game Changer : ‘గేమ్ ఛేంజ‌ర్’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చిన త‌మ‌న్‌.. ఈ సారి మెలోడీతో

బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన దేవర మూవీని రెండు పార్టులు తీస్తున్నారు. తొలి పార్టుకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక రెండో భాగం ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.