Devara : ఎన్టీఆర్ అభిమానులకు పండగే.. పుట్టినరోజుకి ‘దేవర’ అప్డేట్..?

సినిమా వాయిదా పడటంతో 'దేవర' నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

NTR Devara Movie Update on NTR Birthday in May

Devara : కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ అవ్వకపోవడంతో అక్టోబర్ కి వాయిదా వేశారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా వాయిదా పడటంతో ‘దేవర’ నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో దేవర గురించి ఓ టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న దేవర సినిమా నుంచి టీజర్ గాని, ఒక లిరికల్ సాంగ్ కానీ విడుదల చేస్తారని సమాచారం.

Also Read : Sharathulu Varthisthai : ‘షరతులు వర్తిస్తాయి’ రివ్యూ.. మధ్యతరగతి జీవితాల కథ..

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా దేవర నుంచి గ్లింప్స్ తప్ప ఇంకా ఏమి విడుదల అవ్వలేదు, త్వరలో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటం, ఆ రోజు అభిమానులు కచ్చితంగా ఏదో ఒకటి సినిమా నుంచి అప్డేట్ ఆశిస్తారు కాబట్టి కచ్చితంగా దేవర అప్డేట్ ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు.