Devara Success Meet : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన నిర్మాత.. ‘దేవర’ సక్సెస్ మీట్‌కి పర్మిషన్స్ లభించలేదు..

ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో దేవర సక్సెస్ మీట్ అయినా భారీగా పెడతారు అనుకున్నారు.

NTR Devara Success Meet Not Happening Producer says Sorry to Fans

Devara Success Meet : ఎన్టీఆర్ దేవర సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ఇప్పటికే 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి లాభాల్లోకి వెళ్ళింది దేవర సినిమా. అయితే దేవర సినిమాకు తెలుగులో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విషయంలో చాలా నిరాశ చెందారు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా అభిమానులు ఎక్కువమంది వచ్చి రసాభాస అవ్వడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత నిరుత్సాహపడ్డారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో దేవర సక్సెస్ మీట్ అయినా భారీగా పెడతారు అనుకున్నారు. మూవీ యూనిట్ కూడా దేవర సక్సెస్ మీట్ ని నిర్వహిస్తామని చెప్పింది. కాని ఇప్పుడు అది కూడా లేదని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేసాడు.

Also Read : Konda Surekha – RGV : కొండా సురేఖ వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలి..

నాగవంశీ తన ట్వీట్ లో.. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో తారక్ అన్న దేవర సక్సెస్ మీట్ చేసి ఫ్యాన్స్ తో మాట్లాడాలి అని అనుకున్నారు. మేము చాలా ట్రై చేసాము కాని దసరా, దేవి నవరాత్రి వేడుకలు ఉండటంతో అవుట్ డోర్ పర్మిషన్స్ రెండు రాష్ట్రాల నుంచి లభించలేదు. పరిస్థితులు మా చేతుల్లో ఏమి లేవు. అందుకే ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు మేము క్షమాపణలు చెప్తున్నాము. అయినా సక్సెస్ మీట్ పెట్టడానికి మేము మళ్ళీ ప్రయత్నిస్తాము అని తెలిపారు.

దీంతో నాగవంశీ ట్వీట్ వైరల్ అవ్వగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మరోసారి నిరాశకు గురవుతున్నారు. ఎలాగైనా దేవర సక్సెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ తో మాట్లాడించండి అని కామెంట్స్ చేస్తున్నారు.