Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన..

ఆ బాలుడి తల్లి తండ్రులు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

NTR Fan Mother Sensational Comments on Jr NTR Regarding help to his Son

Jr NTR : ఇటీవల దేవర సినిమా రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అనే బాలుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అని ఎన్టీఆర్ తో మాట్లాడాలి అనడంతో అభిమానులు ఎన్టీఆర్ తో వీడియో కాల్ లో మాట్లాడించారు. అప్పుడు ఎన్టీఆర్ ఆ బాలుడి వైద్యానికి కావాల్సిన ఖర్చు అంతా భరిస్తాను అని చెప్పారు. అయితే తాజాగా ఆ బాలుడి తల్లి తండ్రులు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Allu Arjun : గెట్ రెడీ బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

క్యాన్సర్ తో పోరాడుతున్న బాలుడు కౌశిక్ తల్లితండ్రులు సరస్వతి, శ్రీనివాసులు నేడు మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్ తో బాధపడుతున్న నా కుమారుడు కౌశిక్ కు వైద్య సాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు. దేవర సినిమా రిలీజ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ నా తోటి, నా కుమారుడితోను వీడియో కాల్ లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కౌశిక్ కు చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పూర్తయింది. ప్రభుత్వం 11 లక్షలు, టీటీడీ 40 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఇంకా 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి వాళ్ళు అడుగుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

దీంతో వీరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఎన్టీఆర్ అభిమానులు కాని, ఎన్టీఆర్ కాని దీనిపై స్పందిస్తారా చూడాలి.

ఇక ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవర సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. దేవర 2 సినిమా కూడా ఎన్టీఆర్ చేతిలో ఉంది.