NTR – Politics : పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఓటర్లుగా మారరు..

కపిల్ శర్మ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

NTR Gives Clarity on Politics at The Great Indian Kapil Show

NTR – Politics : ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే సినిమాలతో పాటు రాజకీయాలు అని కూడా తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం తరపున ప్రచారం చేసారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. దేవర బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

కపిల్ శర్మ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కపిల్ శర్మ.. ఎన్టీఆర్ ఫ్యామిలిలో నటులతో పాటు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. మీకు ఏది ఇష్టం సినిమానేనా? లేక రెండో కెరీర్ ఉందిగా అని అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. నా మొదటి సినిమాకు 17 ఏళ్ళు. నా ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు నేను నటుడిని అవుదామనుకున్నాను. నేనెప్పుడూ రెండో ఆప్షన్ ఆలోచించలేదు అని అన్నారు.

Also Read : Roll Rida : ర్యాపర్, బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడ అసలు పేరేంటో తెలుసా..? ఈ పేరు ఎలా పెట్టుకున్నాడు అంటే..?

మీ కోసం ఫ్యాన్స్ ఓటర్లు గా మారతారా అని కపిల్ శర్మ అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. లేదు, ఫ్యాన్స్ టికెట్లు కొనడానికి వస్తారు. ఓటర్లుగా రారు. నేను నటుడిగా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతం అని తెలిపారు. దీంతో పాలిటిక్స్ లోకి రాను అని ఎన్టీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చినట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.