NTR Gym Video
NTR Gym Video : ఎన్టీఆర్ ఇటీవల బాలీవుడ్ సినిమా వార్ 2 తో ప్రేక్షశకుల ముందుకు రాగా ఆ సినిమా నిరుత్సాహపరిచింది. దీంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.(NTR Gym Video)
తాజాగా ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ గా మారింది. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సన్నబడటమే కాకుండా కండలు తిరిగేలా బాడీ తెచ్చుకొని సిక్స్ ప్యాక్ కూడా తెప్పించాడు. ఇందు కోసం ఎన్టీఆర్ జిమ్ లో బాగా కష్టపడుతున్నాడు.
తాజాగా లీక్ అయిన వీడియోలో ఎన్టీఆర్ జిమ్ లో బాగా కష్టపడుతున్నాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్ బాడీ లుక్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ షర్ట్ లెస్ బాడీతో ఫొటోలు కూడా ఎడిట్ చేస్తున్నాడు. ఈ ఒక్క వీడియోతో, ఎన్టీఆర్ బాడీ లుక్స్ తో డ్రాగన్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
ఎన్టీఆర్ జిమ్ లో కష్టపడుతున్న వీడియో మీరు కూడా చూసేయండి..
#JrNTR is working hard for #Dragon 🔥💥 pic.twitter.com/nX0jDUEcKq
— Movies4u Official (@Movies4u_Officl) September 16, 2025
Also Read : Priyanka Mohan : OG ప్రమోషన్స్ మొదలు పెట్టిన ప్రియాంక మోహన్.. సినిమా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందంటే..