Priyanka Mohan : OG ప్రమోషన్స్ మొదలు పెట్టిన ప్రియాంక మోహన్.. సినిమా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందంటే..

తాజాగా ప్రియాంక మోహన్ OG సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. (Priyanka Mohan)

Priyanka Mohan : OG ప్రమోషన్స్ మొదలు పెట్టిన ప్రియాంక మోహన్.. సినిమా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందంటే..

Priyanka Mohan

Updated On : September 16, 2025 / 8:58 PM IST

Priyanka Mohan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్, తో సినిమాపై భారీ హైప్ నెలకొంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ నేడు మీడియాతో మాట్లాడింది.(Priyanka Mohan)

ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ గురించి గురించి చెప్తూ.. ఓజీతో ఆల్మోస్ట్ రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆయన అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసు. ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది అని తెలిసింది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా పవన్ గారు ఒదిగే ఉంటారు. ఆయన ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి, ప్రజల గురించి మాట్లాడతారు. షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు, సూచనలు ఇస్తుంటారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేస్తుంటారు అని తెలిపింది.

Also Read : NTR : అమెరికాలో ఎన్టీఆర్ – నీల్ సినిమా..? అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ పోస్ట్ వైరల్..

ఈ సినిమాలో ఛాన్స్ గురించి, తన పాత్ర గురించి మాట్లాడుతూ.. సినిమా అనౌన్స్ చేసిన తర్వాతే నేను ఈ సినిమాలోకి వచ్చాను. నాకు వీడియో కాల్ లో నేరేషన్ ఇచ్చారు డైరెక్టర్. సరిపోదా శనివారం కంటే ముందే ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. పైగా పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఇందులో కణ్మని అనే పాత్ర చేస్తున్నాను. ఈ పాత్రకి నా మనసులో ప్రత్యేక స్థానముంటుంది. ఇది 1980-90లలో జరిగే కథ. నా పాత్ర, ఆహార్యం అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని అని తెలిపింది.

దర్శకుడు సుజీత్, నిర్మాణ సంస్థ గురించి మాట్లాడుతూ.. సీన్ ఎలా తీయాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి.. అని ప్రతి విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్స్ బాగున్నాయంటే దానికి కారణం సుజీత్ గారే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. డీవీవీ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేశాను అని తెలిపింది.

Also Read : Prabhutva Sarai Dukanam : నేషనల్ అవార్డు డైరెక్టర్ మరో బోల్డ్ సినిమాతో.. ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ రిలీజ్..