Devara : ఆక్వామ్యాన్ గా ఎన్టీఆర్.. ‘దేవర’లో షార్క్‌తో మాస్ ఫైట్ సీక్వెన్స్..?
దేవర సినిమాలో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.
- Saketh U
- Published on- August 7, 2023 / 01:43 PM IST
NTR having fight with Shark at Sea in Devara Movie Fan Made Poster goes Viral
Devara Movie : RRR తర్వాత ఎన్టీఆర్(JR NTR) నుంచి రాబోతున్న సినిమా ‘దేవర'(Devara) అవ్వడంతో ఈ సినిమాపై భారీ ఆంచనాలు ఉన్నాయి. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ అని చెప్పారు. ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.
దేవర సినిమాలో ఎన్టీఆర్ కి షార్క్ తో సముద్రంలో ఓ మాస్ ఫైట్ ఉండబోతుందట. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తిమింగలంతో ఫైట్ చేసినట్టు ఎన్టీఆర్ కూడా సముద్రంలో ఓ ఫైట్ చేయనున్నాడని సమాచారం. అందుకే ఎన్టీఆర్ ఆక్వామ్యాన్ గా కనపడతాడేమో అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఎక్కువ గ్రాఫిక్స్ ఉంటాయని, అందుకే ఎన్టీఆర్ గ్రాఫిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇటీవల చిత్రయూనిట్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో కానీ ఒకవేళ నిజంగానే సముద్రంలో ఎన్టీఆర్ తో షార్క్ కి ఫైట్ సీక్వెన్స్ ఉంటే మాత్రం అదిరిపోతుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. ఇక దేవర సినిమా ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్.
