Hyper Aadi : అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది.. సినిమా కలెక్షన్స్ మనం చూడక్కర్లేదు.. వాళ్ళే లెక్కలు చెప్తారు..

ఆదివారం నాడు చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్(Bholaa Shankar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో హైపర్ ఆది(Hyper Aadi) మాట్లాడుతూ చిరంజీవిపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేవారిపై విరుచుకుపడ్డాడు.

Hyper Aadi : అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది.. సినిమా కలెక్షన్స్ మనం చూడక్కర్లేదు.. వాళ్ళే లెక్కలు చెప్తారు..

Hyper Aadi Sensational comments on Ambati Rambabu in Bholaa Shankar Pre Release Event

Hyper Aadi :  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ సినిమా జులై 28న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్ర ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇరిగేషన్ మంత్రి ‘అంబటి రాంబాబు’ని పోలి ఉండటంతో అంబటి రాంబాబు దీనిపై రెస్పాండ్ అయ్యారు. పవన్ పై విమర్శలు చేస్తూ, బ్రో మూవీ కలెక్షన్స్ లెక్కలు చెబుతూ మూడు రోజులు అంబటి మీడియా ముందు హడావిడి చేశారు.

అయితే ఈ విషయంలో అంబటిపై విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ దారుణంగా వచ్చాయి. ఒక ఇరిగేషన్ మినిష్టర్ అయి ఉండి ప్రజల గురించి, ఏపీ గురించి, పోలవరం లెక్కల గురించి మాట్లాడకుండా ఇలా ఒక సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు, ప్రజలు విమర్శలు చేశారు. దీనిపై పలువురు సినిమా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. తాజాగా నటుడు హైపర్ ఆది అంబటి రాంబాబుకి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

ఆదివారం నాడు చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్(Bholaa Shankar) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో హైపర్ ఆది(Hyper Aadi) మాట్లాడుతూ చిరంజీవిపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేవారిపై విరుచుకుపడ్డాడు. హైపర్ అది జనసేన కార్యకలాపాల్లో అధికారికంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి మంచి వాళ్ళు కాబట్టి ఆయన్ని ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకోవట్లేదు. అదే పవన్ అలా కాదు అందరి లెక్కలు తెలుస్తాడు అని అన్నారు. అలాగే ఇటీవల బ్రో సినిమా కలెక్షన్స్ పై మాట్లాడిన అంబటి రాంబాబుకి కౌంటర్ కూడా వేశాడు.

Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఆ డైరెక్టర్ నుంచి తీసుకున్న చిరంజీవి.. చిరు అడిగితే ఆ డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా?

హైపర్ అది మాట్లాడుతూ.. భోళా శంకర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత గారు మీరు రోజూ ఎంత కలెక్షన్స్ వచ్చిందని చూసుకోవక్కర్లేదు. కొంతమంది ప్రెస్ మీట్స్ పెట్టి మరీ సినిమా కలెక్షన్స్ లెక్కలు చెప్తారు. కాబట్టి మీరు భయపడక్కర్లేదు, మన సినిమా కలెక్షన్స్ వాళ్ళే చెప్తారు. ఎంత కలెక్షన్స్ వచ్చినా వాళ్ళు వెనకేసుకున్నంత మాత్రం మనం కలెక్ట్ చేయలేము. అది మనవల్ల కాదు అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి డైరెక్ట్ గా అంబటి రాంబాబుకే అని అర్ధమవుతుంది. అలాగే వైసీపీ మీద కౌంటర్ వేస్తూ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో కానీ ప్రతి ఇంట్లో ఒక మెగాస్టార్ ఫ్యాన్ మాత్రం ఉంటాడు అని అన్నాడు ఆది. ఇప్పుడు హైపర్ అది చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైరల్ గా మారాయి.