NTR – Hrithik : ఇద్దరు టాప్ డ్యాన్సర్స్.. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ వేస్తే.. ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్‌తో..?

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో ఓ అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ ఉందని సమాచారం.

NTR – Hrithik : ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్(Bollywood) వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిన్నే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. యశ్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ భాగమవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వార్ 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్పై యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ అర్థమైపోతుంది.

అయితే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో ఓ అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ ఉందని సమాచారం. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉంటారు. అసలు బాలీవుడ్ లో డ్యాన్స్ వేసే వాళ్ళల్లో హృతిక్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఇక ఎన్టీఆర్ గురించి తెలిసిందే. డ్యాన్స్ తో ఇరగదీస్తాడు. ఇలాంటి ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ కలిసి డ్యాన్స్ వేస్తే ఏ రేంజ్ లో ఉంటుంది.

Also Read : Ram Charan : చెన్నైలో ‘గేమ్ ఛేంజర్’ ఎంట్రీ.. భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో స్టైలిష్ లుక్‌లో గ్లోబల్ స్టార్..

అసలే సూపర్ డ్యాన్సర్స్ ఇద్దరు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నాటు నాటు స్టెప్ వేస్తే ఆస్కార్ అవార్డు వచ్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ కలిసి స్టెప్పేస్తే ఇంక వరల్డ్ మొత్తం అదరాల్సిందే. సినిమాకు హైలెట్ గా ఉండటానికి ఓ స్పెషల్ డ్యాన్స్ సాంగ్ ని పెడుతున్నారని సమాచారం. బాలీవుడ్ గణేష్ మాస్టర్, మన జానీ మాస్టర్ ఇద్దరూ కలిసి ఈ సాంగ్ కి డ్యాన్స్ కంపోజ్ చేయబోతున్నారని వినిపిస్తుంది. ఇదే నిజమైతే థియేటర్స్ లో వీళ్ళ స్టెప్పులకు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.

ట్రెండింగ్ వార్తలు