NTR is the chief Guest for Kalyan Ram Amigos Pre Release Event
Amigos : కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార సినిమాతో ప్రేక్షకులని మెప్పించి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మరింత కాన్ఫిడెంట్ గా మరో కొత్త కథతో రాబోతున్నాడు. అమిగోస్ అంటూ ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తులు కాన్సెప్ట్ తో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తూ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ రిలీజయి సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇటీవల రిలీజయిన ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలు పెంచింది.
ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తులు, అందులో ఒకరు విలన్ అయితే అనే అంశంతో సరికొత్తగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ భామ యషికా రంగనాథ్ నటిస్తుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా కర్నూలులో అభిమానుల మధ్య నిర్వహించారు. ఇప్పుడు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Aditirao Hydari : అదితి వల్లే నాకు ప్రేమపై విరక్తి కలిగింది.. అదితిరావు హైదరి మాజీ భర్త వ్యాఖ్యలు..
అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడు. దీంతో మరోసారి స్టేజిపై అన్నదమ్ములిద్దర్నీ ఒకేసారి చూడొచ్చు. ఎన్టీఆర్ కూడా వస్తుండటంతో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా నందమూరి అభిమానులు రానున్నారు. కళ్యాణ్ రామ్ గత సినిమా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు అంటున్నారు.
3 letters which will take the tale of 3 doppelgangers to the next level – N T R ?#Amigos Pre Release Event with @tarak9999 as the chief guest ?
On 5th Feb at HYD?– https://t.co/T63ceTMvmD#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @shreyasgroup pic.twitter.com/szVI9VT10P
— Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2023