Devara Teaser : ‘దేవర’ టీజర్ రెడీ అయిపోయింది.. హైప్ పెంచిన అనిరుధ్.. రిలీజ్ ఎప్పుడు?

గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు.

NTR Koratala Siva Devara Movie Teaser Update by Music Director Anirudh Ravichander

Devara Teaser : RRR తర్వాత ఎన్టీఆర్(NTR) సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ అప్డేట్స్ ఇస్తున్నా ఎలాంటి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు వాటి గురించి అడుగుతున్నారు.

గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు. అనిరుధ్ తన ట్విట్టర్ లో.. దేవర టీజర్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. అందరూ పులిని అభినందించాల్సిందే అని ట్వీట్ చేసి ఎన్టీఆర్, కొరటాల శివలను ట్యాగ్ చేశాడు.

దీంతో దేవర సినిమా టీజర్ రెడీ అయిందని అర్థమైపోయింది. అనిరుధ్ దీనికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో దేవర టీజర్ గురించి మాట్లాడారు. దీంతో దేవర టీజర్ ఈ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. లేదా డెవిల్ సినిమాతో పాటు థియేటర్స్ లో డిసెంబర్ 29 నుంచి కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా కొన్ని రోజుల్లో దేవర టీజర్ వచ్చేస్తుంది. అభిమానులు టీజర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Also Read : Priyanka Jain : జుట్టు పెరిగాక పెళ్లి చేసుకుంటాను.. పెళ్లిపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ..

ఇక దేవర సినిమాని రెండు పార్టులుగా ప్రకటిచగా మొదటి పార్ట్ ని 5 ఏప్రిల్ 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు. దేవర సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.