NTR Meets a Dumb fan in War 2 Pre Release Event
NTR Fan : నిన్న ఆదివారం ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానులు ఈ ఈవెంట్ కి తరలి వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో ఓ మూగ అభిమాని వైరల్ అయ్యాడు. ఈవెంట్ మొదలవ్వకముందే 10 టీవీ ప్రతినిధి పలువురు ఫ్యాన్స్ ని ఇంటర్వ్యూ చేయగా ఓ మూగ అభిమాని కనిపించారు.
ఈ క్రమంలో ఆ మూగ అభిమానిని 10 టీవీ చేసిన ఇంటర్వ్యూలో కేవలం తన సైగలతోనే తాను ఎన్టీఆర్ కి వీరాభిమాని అని, గుడివాడ నుంచి ఎన్టీఆర్ ని చూడటానికి వచ్చానని తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఈవెంట్ మేనేజ్మెంట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు వెళ్లడంతో ఆ అభిమానిని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి కలిపించారు. ఎన్టీఆర్, హృతిక్ ఆ అభిమానిని పలకరించి ఫొటోలు ఇచ్చారు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : War 2 Pre Release Event : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు..