NTR Neel
NTR Neel : ఇటీవల ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఆపేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే నేడు కాంతార చాప్టర్ 1 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ అదే గాయంతో గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సినిమాని నైజాంలో మైత్రి నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.(NTR Neel)
ఎన్టీఆర్ – నీల్ సినిమాని మైత్రి నిర్మాతలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ – నీల్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు.
Also Read : NTR : కొంచెం నొప్పిగా ఉంది.. మా అమ్మమ్మ చెప్పిన కథలే ఈ సినిమా.. గాయంతోనే ఎన్టీఆర్ స్పీచ్..
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు వచ్చారు కాబట్టి, ఆయన సినిమా మేము చేస్తున్నాము కాబట్టి ఒక ముక్క చెప్తున్నాము. నెక్స్ట్ మంత్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలయి గ్యాప్ లేకుండా అయిపోతుంది. మేము చెప్పిన బెస్ట్ రిలీజ్ డేట్ కి తీసుకొస్తాము. సినిమా అయితే మీ ఆలోచనకే వదిలేశాము. అది వేరే లెవల్. రుక్మిణి వసంత్ మా ఎన్టీఆర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఆయనని మ్యాచ్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది అని తెలిపారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్టు సమాచారం. గతంలో ఈ సినిమాని 25 జూన్ 2026 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ఇటీవల గాయపడటంతో ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. నిర్మాత చూపినట్టు వచ్చే నెలలో షూటింగ్ మొదలు కానుంది. నిర్మాత చెప్పినట్టు చెప్పిన డేట్ కి సినిమా రానుందని తెలుస్తుంది.
Also See : Ritika Nayak : గ్రీన్ పట్టుచీరలో మిరాయ్ భామ.. ఎంత క్యూట్ గా ఉందో..